- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుంటలో జారిపడి గొర్రెల కాపరి మృతి..
ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన ఆదివారం గద్వాల్ మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, గద్వాల్ క్రైమ్: ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన ఆదివారం గద్వాల్ మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ బి. ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగాల గ్రామానికి చెందిన కుర్వ నర్సింహులు వద్ద ఇటిక్యాల మండలానికి చెందిన శేషన్న (19), గొర్ల కాపరిగా పని చేస్తున్నాడు. ఆదివారం సంగాల చెరువు సమీపంలో గల మునెప్ప కుంటలో గొర్రెలు, మేకలను నీరుతాగేందుకు తీసుకెళ్లగా అందులో ఒక గొర్రె చిక్కుకోవడంతో రక్షించేందుకు వెళ్లిన శేషన్న ప్రమాదవశాత్తు కుంటలో జారిపడి మునిగిపోయాడు.
గమనించిన స్థానికులు శేషన్నను రక్షించేందుకు ప్రయత్నించిన కుంట లోతుగా ఉండటంతో శేషన్న నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడి తల్లి బజారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.
Next Story






