మార్చి మధ్యలోనే మండుతున్న ఎండలు..!

by Nallavelli.Anjaneyulu |

జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచే వేసవి మొదలైంది.

మార్చి మధ్యలోనే మండుతున్న ఎండలు..!
X

దిశ, అలంపూర్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఏడాది మార్చి నుంచే వేసవి మొదలైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38-40 డిగ్రీల మధ్య సాగుతుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒకవైపు సాయంత్రం వేళ‌లో వడగండ్ల వర్షాలు.. మరో వైపు మధ్యాహ్నం అయితే చాలు భానుడి సెగలు వేడెక్కుతున్నాయి. మ‌ధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. భానుడి సెగ నుంచి తప్పించుకోవడానికి పలు గ్రామాల్లో యువత, చిన్నారులు స్థానిక ఈత కొలనులు, శివార్లలోని చిన్న నీటితొట్టెలు, పాత బావులను ఆశ్రయిస్తున్నారు. మానవపాడు మండల పరిధిలోని పెద్ద ఆమదాలపాడు గ్రామంలో పాత బావూళ్ళో జలకాలాటలతో సందడి చేశారు. ఈ దృశ్యాలను దిశ న్యూస్ చిత్రీకరించింది. నీటి మట్టం తక్కువగా ఉండటంతో చిన్న పిల్లలు కూడా భయం లేకుండా ఆడుకుంటూ సేద తీరుతున్నారు. "మధ్యాహ్నం ఎండలో బయటకు వెళ్తే తల తిరగడం, వేడిగాలులు అధికం కావడం జరుగుతోంది. ఈ బావులే మాకు ఏకైక రక్షణ అని పేర్కొంటున్నారు స్థానికులు.

Next Story