సీఎం పర్యటన షెడ్యూలు ఖరారు

by Ratna Kumari |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా రెండు రోజుల పర్యటన ఖరారు అయింది.

సీఎం పర్యటన షెడ్యూలు ఖరారు
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లా రెండు రోజుల పర్యటన ఖరారు అయింది. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు హెలిక్యాప్టర్ ద్వారా మక్తల్ కు చేరుకుంటారు. ముఖ్యమంత్రి కి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలుకుతారు. మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు మక్తల్.. నారాయణపేట.. కొడంగల్ ఎత్తిపోతల పథకం, కృష్ణ, భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదనలపై అధికారులతో చర్చిస్తారు. మూడు గంటల 40 నిమిషాల నుంచి నాలుగు గంటల వరకు మక్తల్.. నారాయణపేట... కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం నాలుగు గంటల 10 నిమిషాలకు కోయిల్ సాగర్, కృష్ణ.. భీమా నదులపై నిర్మించ తలపెట్టిన బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు. సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు గూడెం తోటి రిజర్వాయర్, జే ఎన్ ఎల్ ఐ ఎస్ స్టేజ్ వన్ పంపు హౌస్ ను పరిశీలిస్తారు. అక్కడి నుండి బయలుదేరి సాయంత్రం 6 గంటలకు సోమశిల చేరుకుంటారు.


సాయంత్రం 6:45 నిమిషాల నుండి రాత్రి 8:45 నిమిషాల వరకు మగవాని రిసార్ట్స్ రివర్స్ ఫ్రంట్ లో ఉమ్మడి మహబూబ్ న‌గ‌ర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఐదో తేదీన ఉదయము 10:30 గంటలకు కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంపు హౌస్ ను చేరుకుంటారు. 10:40 నిమిషాల నుండి 11:40 నిమిషాల వరకు పాలమూరు... రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3, హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ..2, నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ వన్, డెలివరీ సిస్టర్ ను, ఎం జె కె ఎల్ ఐ ఎస్ లిఫ్ట్ వన్ పంపు హౌస్ లోని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. 1150 నిమిషాల నుండి మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల వరకు నాగలాపూర్ హెలిపాడ్ నుండి బయలుదేరి పి ఆర్ ఎల్ ఐ ఎస్ ప్యాకేజీ 3 కాల్వ పనులు, ఏదుల రిజర్వాయర్, పంపు హౌస్ పనులను ఏవి ఎల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు కుమ్మెర అల్లిపేటకు చేరుకుంటారు. 12:30 గంటల నుంచి ఒకటిన్నర గంటల వరకు పి ఆర్ ఎల్ ఐ ఎస్ ప్యాకేజీ -8, స్టేజ్..3 పంపు హౌస్, బట్టెం రిజర్వాయర్కు సంబంధించిన ప్యాకేజీ..9, 10, 11 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు భూత్పూర్ మండలం కొత్తూరు తెలిపారుకు చేరుకుంటారు. రెండు గంటల పది నిమిషాల నుండి రెండు గంటల 30 నిమిషాల వరకు వీఆర్ఎల్ఐఎస్ కు చెందిన కరువీనర్ రిజర్వాయర్ ప్యాకేజీ 14, 15 పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 నిమిషాల నుంచినాలుగున్నర గంటల వరకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ ద్వారా ఉదండాపూర్ కు చేరుకుంటారు. ఐదు గంటల పది నిమిషాల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు ఉదండాపూర్ రిజర్వాయర్ ప్యాకేజీ 17, 18 పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఉదండాపూర్ వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. రాత్రి 7:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.

Next Story