- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాన్స్ ఫార్మర్ ని ఢీ కొన్న ఇసుక ట్రాక్టర్ కాలి బూడిదైన వైనం
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ ని ఢీ కొనడంతో కింద పడ్డ ట్రాన్స్ ఫార్మర్ కాలి బూడిద అయింది.

దిశ, మక్తల్: అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు కరెంట్ ట్రాన్స్ ఫార్మర్ ని ఢీ కొనడంతో కింద పడ్డ ట్రాన్స్ ఫార్మర్ కాలి బూడిద అయింది. దానికున్న కొన్ని స్తంభాలు వైర్లు మంటలు రేగి ప్రమాదం తప్పిపోయిన సంఘటన మక్తల్ మాగనూర్ పెద్ద వాగు పరిసరాల్లో మక్తల్ మండల పరిధిలోని దాసర్పల్లి గ్రామ శివార్లో రాత్రి చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పొలం యజమాని కరెంటు సప్లై ని నిలిపివేయడంతో పెను ప్రమాదం ప్రమాదం తప్పిపోయింది. రాత్రిపూట వాగు నుంచి అక్రమ ఇసుక కొనసాగించే మాఫియా ఎవరన్నది తనకు తెలియాలని కూలిపోయి... కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్ కూలిపోయిన స్తంభాలు కాలిపోయిన వైర్లు ఇవ్వకుంటే ఎంతకైనా తెగిస్తా అని పోలం యజమాని హంగామా చేసినట్టు సమాచారం.
సంగం బండ పెద్దవాగు నుంచి రాత్రిపూట అక్రమ ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేది లేదని అందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకు న్నామని మక్తల్ మాగనూర్ పోలీసులు. స్పెషల్ ట్రాన్స్ ఫార్మర్ సిబ్బంది మైనింగ్, రెవెన్యూ అధికార్లు, చెబుతున్న మాటలకు చేష్టలకు పొంతనలేదని ఈ సంఘటన రుజువు చేసిందని వాగు పరిసరాల రైతులు అంటున్నారు. మాగనూరు మండలం వర్కూరు గ్రామానికి చెందిన నర్సపొల్ల శీను పొలంలో ఉన్న మక్తల్ శివారులో ఉంది భారీగా వరి సాగు చేసుకున్న రైతు పొలానికి నీళ్లు పెట్టేందుకు పలు బోర్లను వేసుకున్నాడు. ట్రాన్స్ ఫార్మర్ బిగిలించుకున్నాడు. ఇసుక ట్రాక్టర్ ఢీకొనడంతో దిమ్మ పై నుంచి కిందకు కూలిపోయి దానికి అనుసంధానంగా ఉన్న వైర్లు స్తంభాలు విరిగి ట్రాన్స్ఫారం కాలిపోయింది. ఈ ప్రమాదంలో పలు విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు మంటలు రేగడం ఇది గమనించిన రైతు దానికి సప్లై అయ్యే కరెంట్ నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిపోయిందని గ్రామస్తులు అంటున్నారు.
ఈ విషయంపై అక్రమ రాత్రిపూట అక్రమ ఇసుక ట్రాక్టర్లను నడిపే మాఫియా వారిని ట్రాక్టర్ యజమానులను సంప్రదించగా.. రాత్రిపూట జరిగింది అయితే మేము ఏం చేయాలి స్తంభాలు మాత్రమే ఇప్పిస్తామని, మిగతా నష్టాన్ని మీరే భరించాలని నిర్లక్ష్యంగా చెప్పినట్లు. బాధిత రైతు అంటున్నాడు. అక్రమ ఇసుక రవాణాను నియంత్రించే అధికారులు రాత్రిపూట ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, సమాచారం ఇచ్చిన దీనిపై అధికార్లు చర్యలు తీసుకోక పోవడానికి ఈ ప్రమాదం నిదర్శనమని ఆ రైతు అంటున్నారు. తక్షణమే అక్రమ ఇసుక రవాణా మాఫియా పై చర్యలు తీసుకోవాలని. స్థానికులు కోరుతున్నారు.






