భూత్పూరు మున్సిపాలిటీలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం

by Bhoopathi Nagaiah |

భూత్పూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు.

భూత్పూరు మున్సిపాలిటీలో కొలువుదీరిన కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం
X

దిశ, భూత్పూరు : భూత్పూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సోమవారం మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించిన అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. రిజర్వు స్థానం ఎనిమిదవ వార్డు నుండి విజయం సాధించిన బాలకోటిని చైర్మన్‌గా, పదవ వార్డు నుండి గెలుపొందిన లిక్కి సూర్యకళను వైస్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. భూత్పూర్ మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపికైన పదిమంది సభ్యులు బాధ్యతలు తీసుకున్న అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికను నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారులు బాలకోటి, సూర్యకళ ఎంపికైనట్లుగా ప్రకటించారు. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మిగతా సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం టపాసులు పేల్చి తమ ఆనందాలు పంచుకున్నారు.

Next Story