- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగాలి : కలెక్టర్ బాదావత్ సంతోష్
దిశ, కందనూల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా, సజావుగా జరిగేలా చూడాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.

దిశ, కందనూల్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా, సజావుగా జరిగేలా చూడాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న నామినేషన్ల ప్రక్రియను నాగర్ కర్నూల్ మండలంలోని పెద్ద ముద్దునూరు క్లస్టర్ పరిధిలోని పెద్ద ముద్దునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో పెద్ద ముద్దునూరు, చందుబట్ల, గన్యాగుల గ్రామాల పరిధిలోని సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని సూచించారు. అన్ని నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో ఫారం 1 ప్రచురణ చేశారా లేదా అని కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం టీ పోల్ యాప్ లో అప్డేట్ చేయాలని సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థితో పాటు ఒక ప్రపోజర్, మరొకరు లేదా ఇద్దరు మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్, అధికారులు ఉన్నారు.






