- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
దిశ, నవాబుపేట : నవాబుపేట మండల పరిధిలోని యన్మన్ గండ్ల గేటు సమీపంలో గురువారం లభ్యమైన గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఆచూకీ శనివారం లభ్యమైంది. మృతుడిని ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి

దిశ, నవాబుపేట : నవాబుపేట మండల పరిధిలోని యన్మన్ గండ్ల గేటు సమీపంలో గురువారం లభ్యమైన గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఆచూకీ శనివారం లభ్యమైంది. మృతుడిని ఎక్కడో చంపి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించి మృతుడి ఆనవాళ్లు లేకుండా చేసి హంతకులు ఇక్కడి నుంచి పరారు కావడంతో గుర్తు తెలియని యువకుడి హత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును ఓ సవాల్ గా తీసుకుని మూడు రోజుల వ్యవధిలోనే మిస్టరీని ఛేదించారు. ఈ హత్యను హంతకులు పరువుకోసం చేసినట్లుగా భావిస్తున్నారు. హంతకుల్లో ఒకరి కూతురుతో హతుడి సోదరుడు పరారు కావడమే హత్యకు కారణంగా విశ్వసనీయ సమాచారం. హతుడిని ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని ఎలికట్ట గ్రామ సమీపంలోగల ఎల్లంపల్లి గ్రామానికి చెందిన ఎర్ర రాజశేఖర్ (35)గా పోలీసులు గుర్తించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హతుడు రాజశేఖర్.
సోదరుడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన బిసి సామాజిక వర్గంలోని గొల్ల కులానికి చెందిన కాగుల వెంకటేష్ కూతురు భవానితో కలిసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న భవాని తండ్రి వెంకటేష్ మరికొందరితో కలిసి భవాని చంద్రశేఖర్ ల ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఎక్కడ కూడా వారి ఆచూకీ లేకపోవడంతో ఎలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ ఇంటికి వెళ్లి ఆయనను ఇంటి నుండి కిడ్నాప్ చేసి వెంట తమ వెంట తీసుకెళ్లారు. రాజశేఖర్ ను కిడ్నాప్ చేసిన వెంటనే ఆయన భార్య షాద్ నగర్ పోలీసులకు తన భర్త కిడ్నాప్ కు సంబంధించి ఫిర్యాదు చేశారు. ఆలోగానే రాజశేఖర్ ను కిడ్నాప్ చేసిన హంతకులు ఎక్కడో ఆయనను హత్య చేసి అక్కడి నుండి నవాబుపేట మండల పరిధిలోని యన్మన్ గండ్ల గేటు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకువచ్చారు. అక్కడ మృతదేహాన్ని పడవేసి దానిపై పెట్రోల్ పోసి నిప్పంటించి మృతుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా చేసి అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారు. మృతుడు రాజశేఖర్ సోదరుడు చంద్రశేఖర్ అదే గ్రామానికి చెందిన కాగుల వెంకటేష్ కూతురు భవానిని ఎత్తుకెళ్లడం వల్లనే హంతకులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా ఎల్లంపల్లి గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. కేసును ఓ సవాలుగా తీసుకొని ముమ్మరంగా దర్యాప్తు కొనసాగించిన పోలీసులు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే మిస్టరీని ఛేదించి మండల ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉన్నది.






