- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రవళిక హత్య నిందితులను బహిరంగ ఎన్ కౌంటర్ చేయాలి : దళిత సంఘాల నాయకులు
దిశ, మహమ్మదాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల గ్రామానికి చెందిన ప్రవళికను హత్య చేసిన విషయం తెలిసిందే.

దిశ, మహమ్మదాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేముల గ్రామానికి చెందిన ప్రవళికను హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే నిందితులను ఇప్పటి వరకు శిక్షించలేదు. దీంతో తాజాగా దళిత సంఘాల నాయకులు నంచర్ల గేట్ ఎక్స్ రోడ్డు వద్ద విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 17న వేముల గ్రామంలోని రైతు వేదిక సమీపంలో అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే బహిరంగ ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. అగ్రకులాలకు ఒక న్యాయం, దళితులకు మరో న్యాయమా అంటూ నాయకులు ప్రశ్నించారు. ఘటన జరిగి పది రోజులు గడుస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడం ఎంత వరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. నిందితులపై చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గండీడ్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్లాపూర్ ఆశన్న, ఉమ్మడి గండీడ్ మండల మాజీ జడ్పీటీసీ జంగాళ్ల వెంకటయ్య, పరిగి నియోజకవర్గ పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్, మహమ్మదాబాద్ మాజీ ఎంపీటీసీ వేణు గౌడ్, రంగారెడ్డి పల్లి మాజీ ఎంపీటీసీ కిష్టయ్య, జూలపల్లి మాజీ సర్పంచ్ ఎం. రామచంద్రయ్య, ఉమ్మడి పాలమూరు జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, వ్యవసాయ వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు బద్దుల రాజు, గండీడ్ మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు హస్నాబాద్ వెంకటయ్య, స్వేరోస్ జిల్లా అధ్యక్షులు జంగాళ్ల విజయ్ కుమార్, ఎమ్మార్పీఎస్ గండీడ్ మండల అధ్యక్షులు కొండాపూర్ దస్తయ్య, నంచర్ల ఉమ్మడి మండల ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు మాలే వెంకటయ్య పాల్గొన్నారు.






