- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ ప్రజలు చాలా తెలివి పరులు : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిపరులని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన వారికి స్థానిక

దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివిపరులని, అభివృద్ధిని అడ్డుకోవాలని చూసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు కర్రు కాల్చి వాత పెట్టారని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆత్మకూరులో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయాలనేదే లక్ష్యం అని తెలిపారు. అబ్దుల్ కలాం మాటలను స్పూర్తిగా తీసుకున్నానని.. కలలను సాకారం చేయండి అనే నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ఎవ్వరూ ఎక్కువ.. తక్కువ కాదన్నారు.
ఆత్మకూరు, అమరచింత మండలాల్లో పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం అభ్యర్థులు గెలిచిన విధంగానే రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో వందశాతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణాభివృద్ధిని గత పాలకులు విస్మరించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. 50 పడకల ఆసుపత్రి, రూ.123 కోట్లతో జూరాల వద్ద బ్రిడ్జ్ నిర్మాణం, డ్రైనేజీ కాలువలు, మినీ స్టేడియం, పలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు తనపై చేసిన విమర్శలను అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను పార్టీ మారతానని ఓ పెద్ద మనిషి చేసిన వ్యాఖ్యలకు తాను ఎప్పుడూ కాంగ్రెస్ వాదినే అని.. తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు.
రాష్ట్రం లో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలో కట్టి ఎళ్ళు గడుస్తున్నా ప్రాజెక్ట్ లు చెక్కుచెదరలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంబానికి ముందే నెర్రేలు వచ్చాయని.. కాంగ్రెస్ పార్టీకి వరణ దేవుడు కరుణించాడని ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లోభూగర్భ జలాల్లో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయని, క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని ఏవో పనికి రాని మాటలను రైతులు నమ్మరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమతుల్లా, ఆత్మకూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్, తులసిరాజ్ యాదవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.






