పెచ్చులూడుతున్న జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి

by Elthuri vijay kumar |

జడ్చర్ల పట్టణ ప్రజలకు ప్రయాణ ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి అదేవిధంగా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎత్తకుండా జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది.

పెచ్చులూడుతున్న జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి
X

పెచ్చులూడుతున్న జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జి

44వ జాతీయ రహదారి బ్రిడ్జిపై భారీ గుంతలు

బెంబేలెత్తుతున్న వాహనదారులు

మరమ్మత్తులు చేయించాలని వేడుకోలు

దిశ, జడ్చర్ల : జడ్చర్ల పట్టణ ప్రజలకు ప్రయాణ ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి అదేవిధంగా హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఎత్తకుండా జడ్చర్ల పట్టణంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టింది. దీంతో బెంగళూరు వెళ్లే వేలాది వాహనాలకు ప్రయాణం సులభతరమైంది. ఈ క్రమంలోనే జడ్చర్ల చౌరస్తా వద్ద 44వ జాతీయ నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి పై బ్రిడ్జి కు రోడ్డుకు మధ్యలో వేసే జాయింట్ పూర్తిగా ధ్వంసమై బ్రిడ్జ్ పై భాగంలో పెద్ద గోతి ఏర్పడి దీంతో బ్రిడ్జ్ కింది భాగంలో పెచ్చులూడి పడడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది దీంతో బ్రిడ్జి కింద పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి బిట్స్ పైభాగంలో పడ్డ గుంతతో బెంగళూరు వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది భారీ గుంత వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కూడా కనబడడంతో వాహనాలు ఆ గుంతపై నుండి వెళ్తుండడంతో వాహనాల బ్యాలెన్స్ అదుపు తప్పుతుంది. దీంతో ఆ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగే ప్రమాదం పొంచి ఉంది.

బ్రిడ్జ్ స్లాబ్ వద్ద జాయింట్ల వద్ద పెద్ద గుంత ఏర్పడి రోడ్డుకు బ్రిడ్జి మధ్యలో ఉన్న ఇనుప చువ్వలు బయటికి కనబడుతూ ఉన్నాయి. దీంతో ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ప్రయాణం ప్రమాదభరితంగా మారింది. జాతీయ రహదారి నిర్మాణ సంస్థలు గుత్తేదారులు ప్రయాణికుల భద్రత క్షేమం కోరి ఎప్పటికప్పుడు రహదారుల నాణ్యతను పరిశీలించి మరమ్మత్తులు చేయాల్సింది పోయి వాటిని పట్టించుకున్న పాపాన పోలేదని వాహనదారులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. టోల్ ఫీజుల వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ వేలాది వాహనాలు వెళ్లే బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిల నాణ్యతపై దృష్టి సారించడం లేదని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు గుత్తేదారులు స్పందించి జడ్చర్ల ప్లైవర్ బ్రిడ్జిపై ప్రమాదం సంభవించక ముందే గుంతను సరిచేసి వాహనదారుల, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Next Story