జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు..

by Disha Web Desk 13 |
జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు..
X

దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లాలో సోమవారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 658 ఓట్లకు 618 ఓట్ల పోలింగ్ అయింది. ఇందులో 392 మంది పురుషులు, 226 మంది స్త్రీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 93.92 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయాంక్ పర్యవేక్షించారు. ఉదయం 10 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 20% పోలింగ్ నమోదు కాగా సాయంత్రం 4 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 93.92 శాతం పోలింగ్ నమోదైంది.

పోలింగ్ శాతం ఇలా..

నారాయణపేట, ఊట్కూరు, దామరగిద్ద మండలాల 341 ఓట్లకు పేట గవర్నమెంట్ గ్రౌండ్ పోలింగ్ కేంద్రంలో 322 ఓట్లు పోల్ కాగా.. 94.43 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. అలాగే మరికల్, నర్వ, ధన్వాడ మండలాల 53 మంది ఓటర్లకు మరికల్ జెడ్పిహెచ్ ఎస్ లో 47 ఓట్లు పోల్ కాగా 88.68 శాతం నమోదైంది.


మాగనూరు, మక్తల్, కృష్ణ మండలాల 135 మంది ఓటర్లకు మక్తల్ జెడ్పిహెచ్ ఎస్ లో 125 ఓట్లు పోల్ కాగా 92.59 శాతం, కోస్గి మండల 86 ఓటర్లకు ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో 84 ఓట్లు పోల్ కాగా 97.67/: శాతం, మద్దూర్ మండల 43 మంది ఓటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో 40 ఓట్లు పోల్ కాగా పోలింగ్ శాతం 93.02% నమోదైంది.



Next Story

Most Viewed