- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
దిశ, భిక్కనూరు : తాగుడుకు డబ్బులు ఇవ్వ లేదనే మనస్తాపంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...

X
దిశ, భిక్కనూరు : తాగుడుకు డబ్బులు ఇవ్వ లేదనే మనస్తాపంతో వ్యక్తి సూసైడ్ చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన గుండ్రెడ్డి నర్సింహులు (40) తాగుడుకు బానిసై ఎటువంటి పనులు, వ్యవసాయం కూడా చేసుకోకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. తాగుడుకు చేతిలో డబ్బు లు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు డబ్బులు అడిగాడు. కుటుంబ సభ్యులు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన నర్సింహులు ఇంట్లో ఎవరు లేని సమయంలో, దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ ఆంజనేయులు వివరించారు.
Next Story






