- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంకా లభించని గల్లంతైన స్నేహితుల ఆచూకీ..!
జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు నవీన్, యాదగిరిల ఆచూకీ మూడు రోజుల నుంచి ఇంతవరకు లభించలేదు.

దిశ, జడ్చర్ల : జడ్చర్ల మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం గ్రామంలోని చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు స్నేహితులు నవీన్, యాదగిరిల ఆచూకీ మూడు రోజుల నుంచి ఇంతవరకు లభించలేదు. మూడు రోజుల నుంచి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసుల సహాయంతో గాలింపు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గల్లంతైన యువకులకు కోసం గాలింపు చర్యలు వేగవంతం చేయాలని కోరుతూ కలెక్టర్, ఎస్పీ లతో ఫోన్ లో మాట్లాడారు. గల్లంతయిన యువకుల మృతదేహాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని తక్షణమే గజ ఈతగాళ్లను, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించి కనింపు చర్యలు చేపట్టాలని కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ఎస్పీ గల్లంతైన వారి ఆచూకీ కొరకు అవసరమైన అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. మంగళవారం ఘటన స్థలానికి మహబూబ్ నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు జడ్చర్ల తహశీల్దార్ నర్సింగ్ రావు ప్రియ కమలాకర్ చేరుకొని గాలింపు చర్యలను పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడ చేపడుతున్న చర్యలను ఎస్పీ, కలెక్టర్లకు వారు వివరించారు. సుమారు 50 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు. గల్లంతైన వారి ఆచూకి లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గొల్లపల్లిలో ఇద్దరు గల్లంతైన ఘటన పై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మృతదేహాల వెలికితీత వేగవంతం చేసి త్వరగా వెతికి పెట్టాలని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను కోరారు.






