- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశు వైద్యశాలలో కానరాని వైద్యుడు
by Naveena |
మండల కేంద్రంలోని పశు వైద్యశాల పరిస్థితి విచిత్రంగా మారింది.

X
దిశ, వంగూర్: మండల కేంద్రంలోని పశు వైద్యశాల పరిస్థితి విచిత్రంగా మారింది. ఆసుపత్రి ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. గవర్నమెంట్ ఉద్యోగం పొంది వేలాది రూపాయల జీతం తీసుకుంటున్న డాక్టర్ మూడు నెలల నుంచి ఆసుపత్రికి రావడం లేదు. ఎవరికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో మూడు నెలలుగా మండలంలో పశువైద్య సేవలు నిలిచిపోయాయి. పశువులకు చికిత్స చేయించడానికి ఆసుపత్రికి వచ్చిన రైతులు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. గడచిన మూడు నెలల నుంచి ఎప్పుడు చూసినా ఆసుపత్రి లో కాలేజ్ సీట్లు దర్శనమిస్తున్నాయని, ఆసుపత్రి ఎప్పుడు మూసి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డాక్టర్ ను నియమించాలని కోరుతున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో స్టాఫ్ తక్కువగా ఉండడంతో నానా ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి స్టాఫ్ ను కూడా పెంచాలని కోరారు.
Next Story






