- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిన్నారి మృతిపై వేగవంతంగా విచారణ పూర్తి చేయాలి : ఎంపీ మల్లు రవి
నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, పాలెం గ్రామంలో మూడు నెలల పసికందు మృతి దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

దిశ, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, పాలెం గ్రామంలో మూడు నెలల పసికందు మృతి దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మూడు నెలల చిన్నారిని నీటి తొట్టిలో వేసి హత్య చేసిన ఘటనను ఖండిస్తూ, నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పాలెం గ్రామాన్ని సందర్శించిన వారు సంఘటన వివరాలను తెలుసుకొని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో చిన్నారులపై మృతి సంఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి, నిందితులను త్వరగా పట్టుకుని కఠిన శిక్షలు విధించాలని పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందన్నారు.






