ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించిన ఇన్ చార్జి ఎంఈఓ

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-02-19 09:21:14  IST  )

ఉపాధ్యాయుడు ఖ‌లీల్ పై చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించారు ఇన్ చార్జి ఎంఈవో స‌రస్వ‌తి. త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేసినందుకు కంట‌త‌డి పెట్టింది ఎంఈవో.

ఉపాధ్యాయుడిని చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించిన ఇన్ చార్జి ఎంఈఓ
X

దిశ‌, మిడ్జిల్ : ఉపాధ్యాయుడు ఖ‌లీల్ పై చెప్పుతో కొట్టేందుకు ప్ర‌య‌త్నించారు ఇన్ చార్జి ఎంఈవో స‌రస్వ‌తి. త‌న‌పై అస‌త్య ఆరోప‌ణ‌లు చేసినందుకు కంట‌త‌డి పెట్టింది ఎంఈవో. ప్ర‌స్తుతం ఈ విష‌యం జిల్లా వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఉపాధ్యాయుల పని తీరు , ఉపాధ్యాయులు దావతులు విద్యార్థులు వెట్టి చాకిరి అనే కథనంపై ఉపాధ్యాయులతో విద్యా కమిషన్ సభ్యులు వెంకట్ సమీక్ష నిర్వహించారు. విద్యా కమిషన్ సభ్యులు వెంకట్ ముందు పాఠశాల ఉపాధ్యాయుడు ఖలీల్ (ఇంగ్లీష్ టీచర్) తనపై అబద్ధాలు , అసభ్య పదజాలం చేస్తున్నారని ఆవేశంతో వెంటనే ఇన్ చార్జి ఎంఈవో సరస్వతి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న స్థానికులు ఉపాధ్యాయులు ఆమెను అడ్డుకున్నారు. ఉపాధ్యాయుడు ఖలీల్ తనకు రావలసిన నాలుగు నెలల జీతం, ఇంక్రిమెంట్ ఆపారని ఆరోపించారు. పాఠశాల రిజిస్టర్ లో తనకు తెలియకుండా సీఎల్ వేసుకోవడం.. అడిగితే రెస్పాండ్ లేదని తెలిపారు. తనపై అసత్య ప్రచారాలు చేయడం మానసికంగా ఎంతో కృంగిపోయానని ఇన్ చార్జి ఎంఈఓ సరస్వతి తెలిపారు. సమావేశంలో కండతడి పెడుతూ నేను ఇక్కడ విధులు నిర్వహించలేనని నన్ను ఇక్కడి నుండి పంపేయండి అంటూ కంట‌త‌డి పెట్టుకుంది. ఉపాధ్యాయుడు ఖలీల్ రంజన్ సందర్భంగా ఉపవాసం ఉన్నానని అసత్యం చెప్పాల్సిన అవసరం నాకు లేదని అత‌ను కూడా కంటతడి పెట్టాడు. మానసికంగా తనను వేధించిందని పేర్కొన్నారు. ఇద్దరి మధ్య సమస్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది. వెంటనే సమస్యను జిల్లా విద్యాధికారికి తెలియజేశారు. సమస్య ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి మ‌రీ.

Next Story