- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి హామీతో దీక్ష విరమణ.. ఇంతకీ ఏమైదంటే..?
మండల పరిధిలోని గోపాల్ దీన్నే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.

దిశ, వీపనగండ్ల:మండల పరిధిలోని గోపాల్ దీన్నే గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న స్థానిక సమస్యలను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీక్ష స్థలానికి వచ్చిన మంత్రి జూపల్లికి సిపిఎం మండల కార్యదర్శి బాల్ రెడ్డి సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి డి బాల్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామానికి గతంలో మూడు బస్సులు వస్తుండేనని..ప్రస్తుతం ఒక బస్సు మాత్రమే వస్తుందని తెలిపారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారని తెలిపారు. కాబట్టి మూడు బస్సులు నడపాలని, గోపాల్ దీన్నే నుంచి పుల్గర్ చర్ల, కల్వరాల, గోవర్ధనగిరి గ్రామాలకు లింకు బీటీ రోడ్లు నిర్మించాలని, 357 సర్వేనెంబర్ భూ సమస్యను పరిష్కరించాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఇప్పటికీ కొంతమంది రైతులకు రుణమాఫీ ,రైతు భరోసా ఇవ్వలేదని, వారికి వెంటనే వేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని వారు కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం దీక్షలో కూర్చున్న నాయకులకు నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ బాల్ రెడ్డి, సిపిఎం గ్రామ నాయకులు శేఖర్ రెడ్డి, వెంకటయ్య, నిరంజన్, భాస్కర్, రంగస్వామి గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామంలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.






