- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టణంలో మొదలైన మున్సిపల్ ఎన్నికల వేడి
దిశ, మద్దూరు : పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. మద్దూరు, కోస్గి, నారాయణపేట, మక్తల్ మున్సిపల్ కమిషనర్లతో ఈసీ గిరిధర్ సుందర్ బాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, మద్దూరు : పట్టణంలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. మద్దూరు, కోస్గి, నారాయణపేట, మక్తల్ మున్సిపల్ కమిషనర్లతో ఈసీ గిరిధర్ సుందర్ బాబు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం జనవరి 10న ఓటర్ల తుది జాబితా ఖరారు చేయనుంది. నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీ పట్టణంలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు, బీఆర్ఎస్, బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు బీ ఫామ్ దక్కించుకునే ప్రయత్నాలు చేస్తుండటంతో ఆయా పార్టీల నాయకులు సమర్థవంతమైన, ప్రజలలో పలుకుబడి ఉన్న అభ్యర్థులను జల్లెడ పనిలో ఉన్నారు.
రిజర్వేషన్లపై ఉత్కంఠ
నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీలో మద్దూరు పట్టణ కేంద్రంతో పాటు ఉమ్మడి గ్రామపంచాయతీలోని భీంపూర్, నాగంపల్లి, సాపన్ చెరువు తాండ, రెనివట్ల గ్రామపంచాయతీని మద్దూరు మున్సిపాలిటీలో విలీనం చేసి మొత్తం16 వార్డులుగా విభజించగా.. మద్దూరు పట్టణ కేంద్రంలో 10 వార్డులు, రెనివట్ల గ్రామపంచాయతీలో 05, నాగంపల్లి లో ఒక వార్డు ఉన్నాయి. ఇందులో రెండు స్థానాలు ఎస్సీ, ఒక స్థానం ఎస్టి రిజర్వేషన్ ఖరారు అయ్యే అవకాశం ఉంది. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల ఖరారు విషయమై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గ్రామపంచాయతీగా ఉన్న మద్దూరును మున్సిపాలిటీగా మారుస్తూ ఇదే సంవత్సరం జనవరిలో గెజిట్ విడుదల అయింది. నాటి నుంచి ఆశావాహులు లెక్కలేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవలే పంచాయతీ ఎన్నికలు ముగియగా తాజాగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జనవరి 10న ఓటర్ల జాబితా ప్రచురణకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల ఆధారంగా వార్డులు విభజన, రిజర్వేషన్ల ఖరారు జరగనుంది.
చైర్మన్ పదవీ కోసం ప్రధాన పార్టీలు దృష్టి
చైర్మన్ పదవీ దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు దృష్టి పెట్టనున్నాయి. మద్దూరు మండలంలో 24 గ్రామపంచాయతీలకు 18 గ్రామపంచాయతీలు కాంగ్రెస్, 06 గ్రామపంచాయతీలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో ఇరు పార్టీలు చైర్మన్ పదవీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.






