- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భక్తి శ్రద్ధతో గోరటి నరసింహ ఆరాధన మహోత్సవం
మండల పరిధిలోని గౌరారం గ్రామంలోని ప్రజాకవి వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తండ్రి యక్షగాన కళాకారుడు హటయోగి శ్రీ చెన్నదాసు ప్రియ శిష్యుడు గోరటి నరసింహ 17వ ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి.

భక్తి శ్రద్ధతో గోరటి నరసింహ ఆరాధన మహోత్సవం
పెద్ద ఎత్తున భజన కీర్తనలు, ఆటపాటలతో ప్రదర్శనలు
కళాకారులను సన్మానించిన గోరటి వెంకన్న
దిశ, తెలకపల్లి : మండల పరిధిలోని గౌరారం గ్రామంలోని ప్రజాకవి వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తండ్రి యక్షగాన కళాకారుడు హటయోగి శ్రీ చెన్నదాసు ప్రియ శిష్యుడు గోరటి నరసింహ 17వ ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి వెంకన్న ఇంటి వద్ద గురువు ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఘనంగా పూజలు జరిగాయి. ఆయన ఇంటి వద్ద కలశం పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భజన కీర్తనలతో యక్షగానాలతో సంకీర్తనలతో ఆటపాటలతో భజన బృందం కళాకారులు మంగళవారం తెల్లవారుజాము వరకు కళా ప్రదర్శన యక్షగానాలతో అలరించారు. అనంతరం పూజా కార్యక్రమం ముగించి తీర్థప్రసాదాలు ఇచ్చి కళాకారులు అందర్నీ ఘనంగా సన్మానించారు. అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో గోరటి వెంకన్నతో పాటు గురువు ఈశ్వరయ్య, ఉపాధ్యాయుడు బాలస్వామి, ఆంజనేయులు, శ్రీశైలం, కురుమూర్తి, రఘు, కుమార్ అంకాలు, బాల పేరు ఈశ్వరయ్య, నాయకులు పాల్గొన్నారు.






