ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుంది.. రూ. 2 కోట్లతో భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ఎంపీ

by Kodari Anjali |

ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుంది..

ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుంది.. రూ. 2 కోట్లతో భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, ఎంపీ
X

దిశ, అచ్చంపేట: ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుంది.. ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటుందని ఆ క్రమంలోనే వారి సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలో కేంద్రంలో రూ.2 కోట్లతో నూతనంగా నిర్మించే మైనారిటీ కమ్యూనిటీ హాల్ నూతన భవనానికి భూమి పూజ చేశారు. అట్టి పనులను నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ డాక్టర్ మల్లు రవితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ముస్లింలకు అండగా ఉంటామని అవసరమున్న, ఆపద ఉన్న వెన్నుదన్నుగా ఉంటానని ముస్లింలకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగానే ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతుందన్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే మస్జిద్, దర్గా, ఈద్గాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పటికీ ఉంటుందన్నారు.

దర్గాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని హామీ

అచ్చంపేట నియోజకవర్గంలో దర్గాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మస్జిద్ నిర్మాణ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయించే బాధ్యత తానే తీసుకుంటానని ముస్లింలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలతో ముందుకు పోతుందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందనీ తెలిపారు. ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ సభ్యులు, మతపెద్దలు ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషిని వారు ప్రత్యేకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు పేర్కొన్నారు.

ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు..

ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేరళ వయానాడు ఎంపీ ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను అచ్చంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆడపడుచుల మధ్యన ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎంపీ మల్లురవి స్థానిక నాయకులు కలిసి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని తలపించేలా ప్రియాంక గాంధీ ఆలోచన విధానంతో ప్రజల కోసం పాటుపడుతుందని అభినందించారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు.

Next Story