ప్ర‌తీ కుటుంబానికి సొంత ఇల్లు సాకారం చేయ‌డమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, రాజాపూర్ : రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల‌ను బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.

ప్ర‌తీ కుటుంబానికి సొంత ఇల్లు సాకారం చేయ‌డమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం :  ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
X

దిశ, రాజాపూర్ : రాజాపూర్ మండలంలోని రంగారెడ్డి గూడ గ్రామంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల‌ను బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనే కలను సాకారం చేయడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు గౌరవప్రదమైన నివాసం లభిస్తోందనీ తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రతి అర్హత‌ కుటుంబం ఇల్లు కలిగే వరకు కృషి చేస్తాం” అన్నారు. తరువాత ఎమ్మెల్యే, కలెక్టర్ లబ్ధిదారులతో కలిసి భోజనం చేశారు. గ్రామ ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నేతలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story