తెలంగాణలో భవిష్యత్తు బీసీలదే : తీన్మార్ మల్లన్న

by Nallavelli.Anjaneyulu |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు అంతా బీసీలదే అని, రానున్న రోజులలో బీసీ ల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ జెఏసి పనిచేస్తుందని 'తెలంగాణ

తెలంగాణలో భవిష్యత్తు బీసీలదే :  తీన్మార్ మల్లన్న
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు అంతా బీసీలదే అని, రానున్న రోజులలో బీసీ ల రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ జెఏసి పనిచేస్తుందని 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ లోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో బీసీ జెఏసి ఆధ్వర్యంలో, బీసీ ఇంటలెక్ష్యువల్ ఫోరం నాయకులు శ్రీనివాస్ సాగర్, విశ్రాంత డిఇఓ విజయ్ కుమార్ లు ఏర్పాటు చేసిన 'సామాజిక తెలంగాణ కోసం జర్నలిస్టులు, మేధావులతో ప్రశ్నలు, జవాబులు' కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీ లు కలిసి నిలబడి కొట్లాడినప్పుడే తెలంగాణ బలంగా నిలుస్తుందని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలను మోసం చేయడం తప్ప కాంగ్రెస్ పార్టీ బీసీ లకు మేలు చేయదని ఆయన విమర్శించారు. ప్రసంగాలు, హామీ లు వాగ్ధానాల కోసం కాకుండా, మన నిజమైన హక్కులు, ప్రాతినిధ్యం కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మేధావులు, వివిధ సంఘాల ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు తీన్మార్ మల్లన్న సూటిగా సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్, బెక్కెం జనార్ధన్, విశ్రాంత హెచ్ఎం శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు.

Next Story