త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతా.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Web Desk |
త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతా.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, జడ్చర్ల: త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి, జడ్చర్ల నియోజకవర్గం నుండి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కృషి చేస్తానని తెలిపారు. తాను జడ్చర్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు నిర్మించామని గుర్తుచేశారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న తన అభిమానులు, అనుచరులు కలిసి రావాలని, త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా తన పర్యటన ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో కరాటే శ్రీనుచారి, శ్రీను, కృష్ణయ్య తదితరులు ఉన్నారు.

Next Story