సర్పంచ్ పదవులకు మొదటి విడత భారీగా నామినేషన్ల దాఖలు

by Ratna Kumari |

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 17 మండలాలకు 16 మండలాల్లో మొత్తం 423 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 3674 వార్డు సభ్యులకు డిసెంబర్ 11 న జరిగే

సర్పంచ్ పదవులకు మొదటి విడత భారీగా నామినేషన్ల దాఖలు
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ జిల్లాలోని మొత్తం 17 మండలాలకు 16 మండలాల్లో మొత్తం 423 గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు, 3674 వార్డు సభ్యులకు డిసెంబర్ 11 న జరిగే పోలింగ్ కోసం 3 విడతల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటి విడత నవంబర్ 27 నుంచి 29 వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా మొదటి విడత 139 సర్పంచ్ పదవులకు, మొదటి రోజు 108, రెండవ రోజు 143, మూడవ రోజు 675 లతో కలిపి మొత్తం 926 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే మొత్తం 1188 వార్డు సభ్యులకు మొదటి రోజు 71, రెండవ రోజు 211, మూడవ రోజు 2564 లతో కలిపి మొత్తం 2846 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి శనివారం సాయంత్రం 5 గంటల గడువు లోపు వచ్చిన అభ్యర్థులకు అధికారులు టోకెన్లు జారీ చేయగా అర్థరాత్రి 12 గంటల వరకు నామినేషన్లను స్వీకరణ జరిగింది. స్వీకరించిన నామినేషన్ల స్క్రూటిని ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించి, అర్హత గల నామినేషన్ల జాబితాను ప్రకటిస్తారు. అప్పీలు చేసుకోదలచిన వారు డిసెంబర్ 1 వ తేదీ వ‌ర‌కు అవకాశం ఉంటుంది. మ‌రోవైపు రెండవ విడత నామినేషన్ల స్వీకరణ ఈనెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు ఉంటుంది. ఇవాళ‌ ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

Next Story