- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకు భీమాతోనే కుటుంబానికి ధీమా..!
దిశ, జడ్చర్ల : బ్యాంకులోని ఖాతాదారులు ప్రతి ఒక్కరూ బీమా ఇన్సూరెన్స్ చేసుకుంటే విధి వక్రీకరించిన వారి కుటుంబం ధీమాగా ఉంటుందని నాబార్డ్ డీడీఎం షణ్ముఖ చారి,

దిశ, జడ్చర్ల : బ్యాంకులోని ఖాతాదారులు ప్రతి ఒక్కరూ బీమా ఇన్సూరెన్స్ చేసుకుంటే విధి వక్రీకరించిన వారి కుటుంబం ధీమాగా ఉంటుందని నాబార్డ్ డీడీఎం షణ్ముఖ చారి, తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ షీల తెలిపారు. శుక్రవారం జడ్చర్ల మండల పరిధిలోని గంగాపురం గ్రామంలోని తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంకు ఖాతాదారులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు. సామాజిక భద్రత పథకాల్లో భాగ్యసాములు కావాలని సూచించారు. ఏటీఎం రూపే కార్డులను వాడి సమయాన్ని ఆదా చేసుకోవాలని అన్నారు. మోసపూరిత ఫోన్ కాల్స్ వస్తే నమ్మకూడదని అపరిచిత పనుకోవద్దు అపరిచిత ఫోన్ కాల్స్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే 1930 కి ఫోన్ చేసి కంప్లీట్ చేయాలని సూచించారు. గంగాపురం గ్రామీణ వికాస బ్యాంకులో జీపీ జనరల్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 1000 కట్టిన కృష్ణ గౌడ్ ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా అతనికి వచ్చిన రూ. 20 లక్షల ప్రమాద బీమా డబ్బులను అతని భార్య ఆయన ప్రభావతికి చెక్కు అందజేశారు. కార్యక్రమంలో గంగాపురం బ్రాంచ్ మేనేజర్ అశోక్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ నాగ ప్రతాపరెడ్డి, రేవతి, మోహన్, బీఆర్ఎస్ నాయకులు ఇంతియాజ్, గ్రామస్తులు అమర్నాథ్, గోపి రాములు బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు పాల్గొన్నారు.






