- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైస్ మిల్ ను అకస్మిక తనిఖీ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు
మండలం లోని సోలిపూర్ గ్రామంలోనీ సింధు ఇండస్ట్రీస్ సింధు ఆగ్రో సింధు, నవ్య రైస్ మిల్ ను ఎన్ఫోర్స్ మెంట్ సీఐ గణేష్ అధికారులు తనిఖీ నిర్వహించారు.

దిశ, ఖిల్లా ఘనపూర్ : మండలం లోని సోలిపూర్ గ్రామంలోనీ సింధు ఇండస్ట్రీస్ సింధు ఆగ్రో సింధు, నవ్య రైస్ మిల్ ను ఎన్ఫోర్స్ మెంట్ సీఐ గణేష్ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 2022 నుంచి 2026 కు సంబందించి ఖరీప్, రబీ, యాక్షన్ వరి ధాన్యం ప్రభుత్వ రైస్ మిల్ యజమాని సింధు శేఖర్ రెడ్డి లకు ధాన్యం ఇచ్చారు. ధాన్యం కొంత మీర గవర్నమెంట్ కు పంపించారు. ఎంత ధాన్యం ఉంది.? అనే వివరాలు సేకరిస్తున్నామని.. పూర్తి వివరాలు తెలియపటానికి సమయం పడుతుందన్నారు. గోదాం తనిఖీలు చేస్తున్నం అని తెలిపారు. తనిఖీలో ఎనో అనుమానాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల మండలంలోని వివిధ రైస్ మిల్ లు బ్లాక్ లిస్ట్ ఉన్నపటికీ వాళ్ళ దంగరా ఉన్నత్వ వరి ధాన్యం సింధు రైస్ మిల్ పై పంపించి సొమ్ము చేసుకుంట్లు అధికారులు గుర్తించారు. శ్రీరామ రామ రైస్ మిల్ నుంచి కొంత మేరకు ఏశికేలు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇదికాకుండా ఇంక అనేక రైస్ మిల్ కూడా వారికీ సహకరించారు. ధాన్యం రాయచూరు, గుర్బర్గ్, దేవరకొండ, చెన్నయ్ తదితర ప్రాంతాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకున్నారు. మండలంలోని అన్ని మిల్లులు చెక్ చేస్తే.. వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మోసం చేసినట్టు మిల్లుల బండారం బయట పడుతుంది. అధికారులు స్పందించి తనిఖీ చేయాలి. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజశేఖర్, డీసీటీ పాల్గొన్నారు.






