- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల అధికారి
దిశ, మక్తల్ : మండలంలోని లింగంపల్లి కాచువార్ లో ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ క్లస్టర్లను శుక్రవారం ఎన్నికల ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ సచిత్ గొగ్వార్ పరిశీలించారు.

దిశ, మక్తల్ : మండలంలోని లింగంపల్లి కాచువార్ లో ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ క్లస్టర్లను శుక్రవారం ఎన్నికల ప్రత్యేక అధికారి అదనపు కలెక్టర్ సచిత్ గొగ్వార్ పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు కావడంతో ధరకాస్తుల స్వీకరణ క్లస్టర్లన విధులు నిర్వహిస్తున్న ఆర్ ఓ అధికారులతో ఎన్నికల అధికారి మాట్లాడారు. దరఖాస్తుల స్వీకరణ నేటి సాయంత్రం ఐదు గంటలు చివరి రోజు కావడంతో పోటీ చేసే పోటి చేయడానికి అభ్యర్థులు ఉత్సాహం చూపుతుంటారని అభ్యర్థుల ఇచ్చే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి తీసుకోవాలన్నారు. పోటీ చేసే అభ్యర్థి చేతులో నామినేషన్ పత్రాలతో క్లస్టర్ అవరణ లోకి వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి పోటీ చేసే చివరి అభ్యర్థి వరకు దరఖాస్తులు తీసుకోవాలన్నారు. రేపు దరఖాస్తుల (స్క్రూట్నీ ) పరిశీలన ఉంటుంది. క్లస్టర్ అధికారి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు. పరిశీలన ఎంపీడీవో రమేష్, ఎంపీ ఓ కాశీనాథ్ అధికారులు పాల్గొన్నారు.






