- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పేదల సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్
ఇల్లు లేని పేద కుటుంబాల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు.

దిశ, హన్వాడ : ఇల్లు లేని పేద కుటుంబాల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాకారమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. హన్వాడ మండల పరిధిలోని పెద్దదర్పల్లి, పల్లెమోనికాలనీ గ్రామాల్లో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన అలివేలుసత్యం, కే.అంజనేయులు కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఆర్థిక కష్టాలను దూరం చేసేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలను పేదలకు చేరే వేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు పేదల పక్షపాతిగా పని చేస్తున్నారని, విద్య, వైద్యం మెరుగైన స్థాయిలో అందించడం ద్వారా పేదలు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గోనెల శ్రీనివాస్, గంజి శ్రీను, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీరాములు గౌడ్, దేవేందర్, అశోక్ గౌడ్, యాదయ్య గౌడ్, గుండెలి యాదయ్య పాల్గొన్నారు.






