- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్లు కష్ఠమన్నా... ప్రాణం నిలిపిన గతుకుల రోడ్డు..!
దిశ, మక్తల్ : కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది.. కాన్పు కష్టం అని ప్రాణాలకే ముప్పు అని జిల్లా ఆస్పత్రికి వెళ్ళమని పంపారు

దిశ, మక్తల్ : కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది.. కాన్పు కష్టం అని ప్రాణాలకే ముప్పు అని జిల్లా ఆస్పత్రికి వెళ్ళమని పంపారు డాక్టర్లు. కానీ గతుకుల రోడ్డులో అంబులెన్స్ లో కాన్పు తల్లి, బిడ్డల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఆ తరువాత వైద్యం కోసం జిల్లా ఆస్పత్రిలో చేర్పించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. ప్రయాణం కష్టం బాగు చేయమని ప్రజలు మొత్తుకుంటుంటే అదే గతుకుల గర్భిణీ స్త్రీ ప్రాణాలు దక్కించేందుకు అంబులెన్స్ ను వేగంగా నడపడంతొ గతుకులకు కాన్పు సులువుగా అయింది మక్తల్ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ డాక్టర్లు, సిబ్బంది ఉన్నా కాన్పు చేయకుండా మొక్కుబడిగా పరీక్షలు చేసి నిర్లక్ష్యంతో డెలివరీ చేయక గర్భిణీ ని భయపెట్టడం రోజు జరుగుతున్న తంతే అని అంబులెన్స్ సిబ్బంది పేర్కొనడం గమనార్హం.
విరాల్లోకెళ్తే మక్తల్ మండలం సంగం బండ గ్రామానికి చెందిన భారతి( 23)గర్భిణీ పురుటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి రాగా.. సిస్టర్లు వైద్యులు మొక్కుబడిగా చెక్ చేసి (brech ప్రజెంటేషన్ ఉంది) కడుపులో బిడ్డఅడ్డం తిర్గింది. కాళ్లతో కాన్పు అవుతుంది తల్లి ప్రాణానికే కష్టం అని సిస్టర్లు వైద్యులు భయపెట్టడంతో గర్భిణీ స్త్రీ బంధువులు హుటాహుటి న అంబులెన్స్ లో గతుకుల రొడ్లొ వేగంగా వెళ్లారు. మార్గమధ్యంలో ఉట్కూరు గ్రామ పరిసరాల్లో దగ్గర అంబులెన్స్ లో నార్మల్ డెలివరీ అయింది. గతంలో మక్తల్ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో సాధారణ కాన్పులతో రికార్డు ఉంది. ప్రస్తుతం అంత కన్నా మెరుగైన పరికరాలు ఆపరేషన్ థియేటర్ గైనకాలజిస్ట్ డాక్టర్లు సిబ్బంది ఉన్నప్పటికీ.. వైద్యుల నిర్లక్ష్యంతో కాన్పులు చేయక నిర్లక్ష్యంగా కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది ప్రాణాలకు ముప్పు అంటు గర్భిణీని బంధువులను భయపెట్టి పంపిస్తు న్నారు. రోజులో ఇలా పంపడం 5వసారి అని అక్కడ కిందిస్థాయి సిబ్బంది అంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంతో వైద్యం చేయక ఉత్తి పుణ్యానికి జీతం తీసుకుంటున్నారని.. నియోజకవర్గ కేంద్రంలో అన్ని వసతులతో ఆపరేషన్ థియేటర్ గైనకాలజిస్ట్ డాక్టర్లు సిస్టర్లతో కొనసాగుతున్న మక్తల్ ఆసుపత్రిలో ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం వల్లా మక్తల్ చుట్టు పక్కలమూడు మండలాల ప్రజలు ఆస్పత్రికి రావాలంటేనే భయపడుతున్నారని మక్తల్ ఆసుపత్రి పేరును మంటగలుగుతున్నారని పలు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు 108 సిబ్బంది EMT చంద్రశేఖర్, పైలట్ వెంకటేష్, ఆశా వర్కర్ పారిజాతలను అభినందించారు.






