- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీకే చెప్పలేదని విద్యార్థి పై ప్రధానోపాధ్యాయుడి పైశాచికం
దిశ, బిజినేపల్లి : ఓ విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ గాయపరిచిన సంఘటన మండల కేంద్రమైన బిజినేపల్లిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి

దిశ, బిజినేపల్లి : ఓ విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్ గాయపరిచిన సంఘటన మండల కేంద్రమైన బిజినేపల్లిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లట్టుపల్లి గ్రామానికి చెందిన అజీజ్ కుమారుడైనటువంటి సోఫియాన్ మండల కేంద్రంలో గల ఆల్ సైన్స్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా ఈ విద్యార్థి పాఠశాలకు వెళ్లాడు. ఈ క్రమంలో పాఠశాలలో జీకే సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థి సమాధానాలు చెప్పే క్రమంలో అడిగిన ప్రశ్నకు తప్పిదంగా సదరు విద్యార్థి సమాధానం చెప్పడంతో పాఠశాల ప్రిన్సిపల్ జోసెఫ్ విద్యార్థి ముఖంపై గాయపరిచాడు. దీంతో ఈ విద్యార్థి చెంపలపై గాయాలు ఏర్పడ్డాయి.
గతంలో ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులను పలు రకాలుగా ఉపాధ్యాయులు విద్యార్థులను గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం 4వ తరగతి విద్యార్థిని గాయపరిచారు. ఆ విషయాన్ని బయటకి రాకుండా కప్పిపుచ్చారు. గత సంవత్సరం కూడా ఎందరో విద్యార్థులను గాయపరిచిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సంఘటనలు బయటికి రాకుండా పాఠశాల యాజమాన్యం వ్యవహరించినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక ప్రిన్సిపల్ను వివరణ కోరెందుకు దిశ రిపోర్టర్ ఫోన్ చేయగా మేము తల్లిదండ్రులతో కాంప్రమైజ్ అయ్యాము, మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీరెవరు మాకు ఫోన్ చేయడానికి మీరెవరు అనవసరంగా మాట్లాడకుండా ఫోన్ పెట్టేయండని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఫోన్ కట్ చేయడం జరిగింది. ఈ విషయంపై ఎంఈఓ ను వివరణ అడగ్గా విద్యార్థిని గాయపరిచినట్లయితే విచారణ చేపట్టి ఆఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.






