- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరణంలోనూ వీడని అన్నదమ్ముల అనుబంధం..!
దిశ, జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న సురేందర్ రావు వనపర్తి లో నివాసం ఉంటున్న తన అన్న నరసింహారావు హఠాత్ మరణం

దిశ, జడ్చర్ల : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న సురేందర్ రావు వనపర్తి లో నివాసం ఉంటున్న తన అన్న నరసింహారావు హఠాత్ మరణం చెందాడన్న విషయం తెలిసిన వెంటనే తమ్ముడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వారం రోజుల నుండి అస్వస్థతకు గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్న సురేందర్ రావుకు తన అన్న మరణ వార్త విని గుండెపోటుతో చనిపోయాడని బంధువులు బోరున విలపిస్తున్నారు. అన్నదమ్ములిద్దరూ చిన్నప్పటినుండి ఏ పని అయినా కలిసి చేసేవారని కలిసి ఉండే వారని ఒకరికి ఆపద వస్తే మరొకరు విలవిలలాడేవారు అని ఎంతో అన్యోన్యంగా అన్నదమ్ముల బంధానికి నిదర్శనంగా ఉండే నరసింహారావు సురేందర్రావు ఇద్దరు క్షణాల వ్యవధిలో అనంత లోకాలకు వెళ్లిపోవడంతో దేవుడు మరణంలో కూడా అన్నదమ్ముల బంధాన్ని విడదీయలేకపోయాడని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనతో ఇటు జడ్చర్లలో అటు వనపర్తి లో నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఈ విషయం జడ్చర్ల పట్టణంలో మరణించిన అన్నదమ్ముల స్నేహితులు కాలనీవాసులు జీర్ణించుకోలేక ఆవేదన చెందుతున్నారు.






