రైతును అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే

by Kodari Anjali |

కల్వకోల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతును అరిగోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, పెద్దకొత్తపల్లి: రాష్ట్రం లో రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి మండిపడ్డారు. పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ బంట్రోత్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, రెండున్నర సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోలేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలు 420 అబద్దపు హామీలు నెరవేరుస్తామని, గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేసిందా అని ఆయన ప్రశ్నించారు. గత పదేళ్ల బీ ఆర్ఎస్ ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాల పాలనను రాష్ట్ర రైతాంగం ప్రజలు గమనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్షన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ జండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్ గురించి కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి బూతులో బూతు లెవెల్ ఏజెంట్ కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి ఇల్లు తిరిగి ఓటర్లను గుర్తించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గణేష్ రావు, పార్టీ సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, చటమోని వెంకటస్వామి, సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story