- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదని శనివారం గాంధీ చౌరస్తాలో భారీ ఎత్తున రైతుల తో కలిసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు.

దిశ, ఆత్మకూర్, మక్తల్ : రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదని శనివారం గాంధీ చౌరస్తాలో భారీ ఎత్తున రైతుల తో కలిసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ధాన్యం కొనుగులో కేంద్రాలను ప్రారంభించి దిగిన ఫోటోలను పేపర్స్ లో ఫోటోలకే పరిమితం అవుతున్నారని రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిమ్మకు నిరేత్తినట్టు ప్రవర్తించడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. రైతుల పండించిన ధాన్యంను ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామని చెప్పి కేంద్రాలను తెరిచిన రైతుల నుంచి ధాన్యం కొనుగోల్ చేయడంలో ఘోరంగా విఫలమైందని వైఫల్యాలను ఎండగట్టారు,రైతులకు అన్యాయం చేస్తేసహించేది లేదన్నారు.
నియోజకవర్గంలో ఎక్కడ అన్యాయం జరిగిన వారికి అండగా ఉంటానని.. రైతుల ధాన్యాని వెంటనే కొనుగోలు చేయాలనీ లేదంటేమున్ముందు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. రైతులని పొట్ట కొట్టి కన్నీళ్లు పేట్టించిన వాళ్ళు బాగుపడిన దాఖలులేవని చరిత్రలో ఎవ్వరు లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ వర్గం వారికీ కూడా న్యాయం జరగడం లేదన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కపట ప్రేమ చూపడం ఆపి ఇప్పటికైనా స్పందించి కొనుగోలు కేంద్రాలని ఆచరణలోకి తేవాలని చెప్పారు. తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలిగా వెళ్లి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ మండలాల రైతులు, నాయకులు పాల్గొన్నారు.






