- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
దిశ, మక్తల్ : డిసెంబర్ 01న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరివీలించారు. సోమవారం వెలిపాడు ఆంజనేయస్వామి దర్శనం, బహిరంగ

దిశ, మక్తల్ : డిసెంబర్ 01న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మక్తల్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ పరివీలించారు. సోమవారం వెలిపాడు ఆంజనేయస్వామి దర్శనం, బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి సందర్శించే ప్రాంతాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మందు జాగ్రత్త చర్యగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల పరిపాలన పై మొదటిసారిగా ప్రజా పాలన పై బహిరంగ సభ లో పాల్గొంటున్నందున పెద్ద మొత్తంలో ప్రజా సమీకరణ అధికారులు పార్టీ వీఐపీ లు పాల్గొంటున్నారు. ట్రాఫిక్ నిబంధనల ను తూచా తప్పకుండా పాటిస్తూ అధికారులు, ప్రజా నాయకుల వాహనాల పార్కింగ్ ఉండాలని అధికారులకు సూచన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలిఫెంట్ దిగినప్పటి నుంచి మళ్ళీ వెళ్లేంత వరకు తగు చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీరామ్ ప్రణిత్, డీఎస్పీ, ఎస్సైలు పాల్గొన్నారు.






