అట్టహాసంగా ప్రారంభమైన పిల్లలమర్రి బాలోత్సవం

by Ratna Kumari |

పిల్లల మనోవికాసానికి, వారిలో సృజనాత్మకతకై ప్రారంభమైన 'పిల్లలమర్రి బాలోత్సవం' వేలాదిమంది బాల బాలికలతో అట్టహాసంగా ప్రారంభమైంది.

అట్టహాసంగా ప్రారంభమైన పిల్లలమర్రి బాలోత్సవం
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పిల్లల మనోవికాసానికి, వారిలో సృజనాత్మకతకై ప్రారంభమైన 'పిల్లలమర్రి బాలోత్సవం' వేలాదిమంది బాల బాలికలతో అట్టహాసంగా ప్రారంభమైంది. సోమవారం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్స్ లో అందేశ్రీ వేదికపై ప్రారంభమైన 'పిల్లలమర్రి బాలోత్సవం' (4 వ పిల్లల జాతర) లో మహబూబ్ నగర్ జిల్లాలోని 60 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో మానసిక ఒత్తిడి అధిగమించి వారిలో చైతన్యం, పరిజ్ఞానం పెంపొందుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులకు అభినందనీయమని కొనియాడారు. బాలోత్సవ అధ్యక్ష,కార్యదర్శులు బెక్కెం జనార్ధన్, డాక్టర్.ప్రతిభ లు మాట్లాడుతూ, పిల్లలకు చదువు చాలా ముఖ్యమేనని, కానీ ఆ చదువు ఒత్తిడితో కాకుండా, ఇష్టపడి చదివే వాతావరణం కావాలన్నారు. ఆ వాతావరణాన్ని పిల్లలమర్రి బాలోత్సవం కల్పించిందన్నారు. పిల్లల్లో కుల మత తారతమ్యాలు సమిసిపోవడానికి, తామంతా ఒక్కటేనన్న భావన పెరగాలని చిన్నారుల్లో ఇటువంటి విశాల భావనలు ఉత్పందం కావడానికి, సృజనను ప్రోత్సహించడానికి ఈ పిల్లలమర్రి బాలోత్సవం పిల్లల జాతర దోహద పడుతుందన్నారు. అనంతరం చిత్రలేఖనం, డ్రాయింగ్, శాస్త్రీయ నృత్య ప్రదర్శన, జానపద, సీని పాటలు, ఏకపాత్రాభినయం, సైన్స్ ఎగ్జిబిషన్, భరత నాట్యం తో పిల్లల్లో ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరాంజనేయులు, సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షుడు, గౌరవ సలహాదారు జగపతిరావు, కవి లక్ష్మణ్ గౌడ్, ప్రమోద్ కుమార్, జర్నలిస్టు రాములు పాల్గొన్నారు.

Next Story