నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవం

by Bhoopathi Nagaiah |

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 23వ వార్డు సభ్యుడు తీగల సునేంద్ర, వైస్ చైర్మన్గా 8వ వార్డు సభ్యుడు బాదం రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవం
X

దిశ, కందనూల్ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్‌గా 23వ వార్డు సభ్యుడు తీగల సునేంద్ర, వైస్ చైర్మన్గా 8వ వార్డు సభ్యుడు బాదం రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా ప్రమాణస్వీకారం అనంతరం నిర్వహించిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమంలో చైర్మన్ వైస్ చైర్మన్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.నాగర్ కర్నూల్ పట్టణ అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతామని, ప్రజలకు పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Next Story