- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలం తాటికొండ స్టేజి వద్ద గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ సైదాబాద్ ప్రాంతానికి చెందిన వారిగా భావిస్తున్న ఏడుగురు తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణం అయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ క్రిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. భూత్పూర్ పోలీసులు, ఎల్ అండ్ టి సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కారులో ఇరుక్కుపోయి ఉన్న వారిని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను, గాయపడ్డ వారిని హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.
Next Story






