- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కారు బోల్తా.. ఇద్దరి పరిస్థితి విషమం
దిశ, అలంపూర్ : కారు బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి

దిశ, అలంపూర్ : కారు బోల్తా పడి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మానోపాడుమండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై సాల్ట్ హోటల్ సమీపంలో కారు బోల్తా పడింది. కర్నూలు జిల్లా లక్ష్మీపురం నుంచి హైదరాబాద్ కి వెళ్తుండగా.. మార్గ మధ్యలో జాతీయ రహదారి పక్కన ఉన్న డివైడర్ రాళ్లను ఢీ కొట్టుకుంటూ బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు 108 సిబ్బంది తెలిపారు. కారులో ఐదు మంది ఉన్నట్లు గుర్తించారు. మేరీ, కళావతి( 60) విషమంగా ఉందని, సులోమన్ (63), మనోజకుమార్ (37), శెట్టి (35), ఫియాపాప (3) గాయాలు అయినట్లు 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. రహదారి పక్కన ఉన్న డివైడర్ దిమ్మెలకు తగులుకుంటూ రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొని ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని హైవే సిబ్బంది తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






