- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉత్కంఠకు తెర లేపిన 'కాల్' రాజకీయం..
మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బీ-ఫామ్‌ల కేటాయింపు ప్రక్రియ క్లైమాక్స్ దశకు చేరుకుంది.

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో బీ-ఫామ్‌ల కేటాయింపు ప్రక్రియ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఈ రోజు ఉదయం నుంచే మహబూబ్‌నగర్ క్యాంప్ కార్యాలయం నుంచి కొందరు అభ్యర్థులకు ఫోన్ కాల్స్ రావడం ప్రారంభమైంది. అయితే, మరికొందరు ముఖ్య నేతలకు ఎటువంటి పిలుపు రాకపోవడంతో ఆశావహుల్లో టెన్షన్ పీక్స్‌కు చేరుకుంది.
క్యాంప్ కార్యాలయమే కీలకం..
క్యాంప్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిన వారే అధికారిక అభ్యర్థులని, వారికే బీ-ఫామ్ దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. దీంతో కాల్స్ అందిన వారు సంబరాలు చేసుకుంటూ నామినేషన్ పత్రాల్లో ‘కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి’గా రాసుకుంటున్నారు. మరోవైపు, ఏమాత్రం సమాచారం లేని అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
జాగ్రత్త పడుతున్న ఆశావహులు..
ఫోన్ రాని ఆశావహులు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకవేళ తమకు హ్యాండ్ ఇస్తే రాజకీయ భవిష్యత్తు ఏంటన్న ఆందోళనతో, వారు ఒక సెట్ కాంగ్రెస్ అభ్యర్థిగా, మరో సెట్ ఇండిపెండెంట్‌గా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. టికెట్ తమకే వస్తుందని ఆశించిన నేతలు, ఇప్పుడు క్యాంపు కార్యాలయం నుంచి వచ్చే ఒక్క ఫోన్ కాల్ కోసం కళ్ళప్పగించి చూస్తున్నారు.
రెబల్ సెగ తప్పదా..
నామినేషన్ల పరిశీలన తర్వాతే బీ-ఫామ్ ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం చెప్పడంపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరికి కాల్స్ రావడం, తమకు రాకపోవడంపై గుర్రుగా ఉన్న నేతలు.. అర్హులైన తమకు కాదని వేరే వారికి అవకాశం ఇస్తే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో ఈ ‘కాల్ సెంటర్’ రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది.






