- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్లూ కోల్ట్ సిబ్బంది కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు : ఎస్పీ జానకి
బ్లూ కోల్ట్ సిబ్బంది అత్యవసర సమయాల్లో సేవలందిస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారని ఎస్పీ జానకి అన్నారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : బ్లూ కోల్ట్ సిబ్బంది అత్యవసర సమయాల్లో సేవలందిస్తూ కీలకపాత్ర పోషిస్తున్నారని ఎస్పీ జానకి అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం కవాతు మైదానంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న 'బ్లూ కోల్ట్' సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రజలు చేసే 100 నెంబర్ కాల్స్ కు తక్షణమే స్పందిస్తూ.. ఎక్కువగా ద్విచక్ర వాహనాలపై వేగంగా ప్రయాణించాల్సి వస్తుందని, అందువలన తప్పని సరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని ఆమె సూచించారు. బ్లూ కోల్ట్ సిబ్బంది బాధ్యతలు కేవలం కాల్స్ స్పందించడమే కాకుండా ప్రమాద స్థలాలకు తక్షణం చేరుకోవడం చట్టం, శాంతి భద్రతల నిర్వాహణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర సమయాల్లో ప్రజలకు సహాయం చేయడం లాంటి కీలక విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ జానకి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు ఎన్బీ రత్నం, సురేష్ కుమార్, డిఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, ఆర్ఐ లు కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






