విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం

by Ratna Kumari |

విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు.

విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం
X

దిశ, మిడ్జిల్ : విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఆరోగ్య చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పోటీలను సర్పంచ్ శంకర్ ముదిరాజ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా అవసరం అని అన్నారు. పోటీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎడ్ల శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. సీఎం పోటీలకు తెలంగాణ ఉద్యమకారుడు మామిడి మాడ భాస్కర్ క్రీడ విద్యార్థులకు భోజన వసతితోపాటు షీల్డ్ లను తన సొంత నిధులతో అందజేశారు. విద్యార్థుల సంస్కృత కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రజా ప్రతినిధులను, అధికారులు సన్మానించారు. అనంతరం గెలుపొందిన పాఠశాల క్రీడా జట్టుల కు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ స్వప్న, ఎంపీడీవో గీతాంజలి , సర్పంచులు నాగరాజ్ గౌడ్ , శ్రీశైలం యాదవ్ , నాయకులు బరిగెల వెంకటయ్య, సంపత్ కుమార్, గౌస్, మల్లికార్జున్ రెడ్డి, సత్యం గౌడ్, విజయ్ కుమార్, నరసింహ, శివ, జహీర్ , వెంకటయ్య పర్వతాల్, ఉస్మాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Next Story