యువ‌త‌కు ఆదాయ వ‌న‌రులు సృష్టించ‌డ‌మే ల‌క్ష్యం : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Ratna Kumari |

బాలానగర్ మండలంలోని మొదంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బయోఫ్లోక్ ఫిష్ ట్యాంక్స్ ను రాష్ట్ర మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.

యువ‌త‌కు ఆదాయ వ‌న‌రులు సృష్టించ‌డ‌మే ల‌క్ష్యం :  మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ, జడ్చర్ల : బాలానగర్ మండలంలోని మొదంపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బయోఫ్లోక్ ఫిష్ ట్యాంక్స్ ను రాష్ట్ర మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో ఆధునిక వ్యవసాయ , అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బయోఫ్లోక్ ఫిష్ కల్చర్ వంటి కొత్త సాంకేతికతలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకువచ్చి, యువతకు ఆదాయ వనరులు సృష్టించడం తమ లక్ష్యమని తెలిపారు. మోదంపల్లి గ్రామంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల మున్సిపల్ చెర్మన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్స్ చైతన్య చౌహన్, కుమ్మరి రాజు, మండల కాంగ్రెస్ నాయకులు ఆదినారాయణ రెడ్డి, గ్రామసర్పంచ్, శివ, పద్మనాబి రెడ్డి, పాల్గొన్నారు.

Next Story