- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబం పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తాం : ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి మండల పరిధిలోని సంజపూర్ గ్రామంలో గుర్రం జంగయ్య కుటుంబం పై దాడికి పాల్పడినటువంటి నిందితులను కఠినంగా శిక్షిస్తామని నాగర్

దిశ, కల్వకుర్తి : కల్వకుర్తి మండల పరిధిలోని సంజపూర్ గ్రామంలో గుర్రం జంగయ్య కుటుంబం పై దాడికి పాల్పడినటువంటి నిందితులను కఠినంగా శిక్షిస్తామని నాగర్ కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. గురువారం ఆయన సంజపూర్ లోని హత్యయత్న ఘటన స్థలాన్ని, క్షతగాత్రుల వ్యవసాయ పొలాన్ని పరిశీలించారు. దయ, కరుణ, ప్రేమ వంటి మానవ లక్షణాలను విస్మరించి, క్రూరంగా ఒక కుటుంబం పై మారణయుధాలతో దాడులు చేసి తీవ్రంగా గాయపరిచిన 6గురు నిందితులలో 5గురుని పట్టుకున్నామని, ఒకరి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకొని తగిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం 5 మంది అదుపులో ఉన్నారని.. ఈ దాడుల్లో చెర్కూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, వెల్దండ మండలానికి చెందిన 4 గురు పాల్గొన్నారని వెల్లడించారు. క్షతగాత్రుడు పరమేష్ ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ వివరించారు. ఎస్పీ వెంట కల్వకుర్తి డివిజన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవ రెడ్డి ఉన్నారు.






