- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెంట్ హౌస్ సామాగ్రి దొంగ అరెస్టు
పట్టణంలోని వివిధ టెంట్ హౌస్ లు, సంప్లయింగ్ కంపెనీ వద్ద ఫంక్షన్లు ఉన్నవని నమ్మబలికి వంట సామాగ్రి ని కిరాయికి తీసుకుని తిరిగి ఇవ్వకుండా దాచిపెడుతూ మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మహబూబ్ నగర్ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ తెలిపారు.

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : పట్టణంలోని వివిధ టెంట్ హౌస్ లు, సంప్లయింగ్ కంపెనీ వద్ద ఫంక్షన్లు ఉన్నవని నమ్మబలికి వంట సామాగ్రి ని కిరాయికి తీసుకుని తిరిగి ఇవ్వకుండా దాచిపెడుతూ మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మహబూబ్ నగర్ టూ టౌన్ సీఐ ఇజాజోద్దీన్ తెలిపారు. పట్టణంలోని శ్రీ విష్ణు టెంట్ హౌస్ యజమాని ఎం. విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నెంబర్ 149/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి ఆధారాలు, సమాచార సేకరణ ద్వారా నిందితుడు ఎండి లబాసిత్ అలీ(38) ని శనివారం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితుడిని విచారించగా.. మొత్తం 2.95 లక్షల రూపాయల విలువైన టెంట్ హౌస్ సామాగ్రిని అతడి ఇంటిని నుండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. విలువైన వస్తువులు, వాహనాలు, ఇతర సామాగ్రి అద్దెకు ఇచ్చే సమయంలో సంబంధిత పూర్తి వివరాలు, ఆధార్ కార్డు, గుర్తింపు పత్రాలు, మోబైల్ ఫోన్ నెంబర్ ను తప్పనిసరిగా ధృవీకరించుకొని ఇవ్వాలని సీఐ సూచించారు.






