- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2036 ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ : మంత్రి వాకిటి శ్రీహరి
దిశ, మక్తల్ : 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.

దిశ, మక్తల్ : 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ -2047 లో భాగంగా ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సదస్సు లో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడా విధానంలో సంస్కరణలు తీసుకొస్తూ క్రీడా పాలసీని ప్రకటించి తెలంగాణలోనే 119 నియోజక వర్గాల్లో మినీ స్టేడియాలు, గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెయ్యి ఎకరాల్లో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ ని ఏర్పాటు చేసి తద్వారా ఒలంపిక్, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లకు ఆతిథ్య కేంద్రంగా హైదరాబాద్ ని తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. స్పోర్ట్స్- టెక్ స్టార్టప్ లు టూరిజం లాంటివి అన్నీ టీ- హబ్, టీఎస్- ఐ పాస్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయన్నారు.
యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీని నూతనంగా ఏర్పాటు చేశామని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ద్వారా పాఠశాల స్థాయి నుంచే క్రీడా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. బాలికలకు, పారా అథ్లెట్ ల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు, స్పోర్ట్స్ స్కూల్లోని క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు లౌబరో యూనివర్సిటీ, కొరియా నేషనల్ స్పోర్ట్ యూనివర్సిటీ వంటి సంస్థలను భాగస్వాములుగా చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అథ్లెట్ ల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని.. వారికోసం గ్రేడెడ్ ఇంటెన్సివ్ లు, ఇన్సూరెన్సు, గురువందనం లాంటి స్కీములు ప్రవేశపెట్టి క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం కోచింగ్ మౌలిక సదుపాయాలు ఇన్నోవేషన్ అథ్లెట్ డెవలప్మెంట్ రంగాల్లో భాగస్వాములు కావడానికి ఈ వేదిక ద్వారా ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ సదస్సులో మైనారిటీ శాఖ మంత్రి, ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ అజారుద్దీన్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.పీ జితేందర్ రెడ్డి,స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనారెడ్డి,స్పోర్ట్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లె,అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్ పీ.వీ సింధు, జ్వాలా గుత్తా, స్పోర్ట్స్ సీనియర్ జర్నలిస్ట్ బాలా మజుందార్, స్పోర్ట్స్ హబ్ మెంబర్ పాల్గొన్నారు.






