- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉద్యమకారుడిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి
by samatah |
తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి పై ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని మైత్రి ప్రింటర్స్ వద్ద మున్నూరు రవి తన మిత్రులతో కలిసి ఉన్న

X
దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి పై ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి పాల్పడ్డారు. జిల్లా కేంద్రంలోని మైత్రి ప్రింటర్స్ వద్ద మున్నూరు రవి తన మిత్రులతో కలిసి ఉన్న విషయాన్ని గుర్తించిన కొంతమంది దుండగులు ఒకసారి గా మున్నూరు రవి పై విరుచుకుపడ్డారు. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఉన్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. గాయాలతో బయటపడ్డ మున్నూరు రవి తనపై 15 మందికి పైగా దుండగులు దాడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం మున్నూరు రవిని వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Next Story






