ఉపాధ్యాయుల దావ‌త్.. విద్యార్థులతో వెట్టి చాకిరి..!

by Nallavelli.Anjaneyulu |

మండల కేంద్రంలో ఓ దావత్ కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా మధ్యాహ్నం సమయంలో ఫంక్షన్ హాల్ కు వెళ్లారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తమ తరగతి గదులను చీపిరితో ఊడుస్తూ కనిపించారు.

ఉపాధ్యాయుల దావ‌త్.. విద్యార్థులతో వెట్టి చాకిరి..!
X

దిశ, మిడ్జిల్ : మండల కేంద్రంలో ఓ దావత్ కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా మధ్యాహ్నం సమయంలో ఫంక్షన్ హాల్ కు వెళ్లారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు తమ తరగతి గదులను చీపిరితో ఊడుస్తూ కనిపించారు. కొంతమంది విద్యార్థులు ఆడుతూ పాడుతూ తరగతి గదిలో గందరగోళంలో ఉన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం సమయంలో ఉపాధ్యాయులు 20 మంది ఉపాధ్యాయులకు ఇద్దరు తప్ప ఎవరు లేకపోవడంతో గ్రామస్తులు పాఠశాల గేటుకు తాళం వేశారు. తమ పిల్లలను పాఠశాలకు పంపితే పాఠశాలలో వెట్టి చాకిరి చేస్తున్నారని సమాచారంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల పని తీరు పట్ల రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. పాఠశాల వేళలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ స్వప్న, సర్పంచ్ శంకర్ ముదిరాజ్ పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల పనితీరు విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. పాఠశాల పనితీరుపై ఎంఈఓ సరస్వతిని వివరణ కోరగా పాఠశాలలో ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Next Story