కుళాయి నీరు డ్రైనేజీ పాలు.. పట్టించుకోని అధికారులు

by I. Sairam |

మండల పరిధిలోని గ్రామంలో గత కొంతకాలంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రాగు నీటిని విడుదల చేయడం జరుగుతుంది.

కుళాయి నీరు డ్రైనేజీ పాలు.. పట్టించుకోని అధికారులు
X

దిశ, నర్వ: మండల పరిధిలోని గ్రామంలో గత కొంతకాలంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు త్రాగు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుళాయికి నల్లా బిగించడంలో నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ గ్రామంలో ఒక వాడుకు నీరు సప్లై కాగా మరొక వాడుకు నీటి సరఫరా సరిగ్గా అందడం లేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు. వృధాగా పోతున్న కుళాయిలకు నల్లాని బిగించితే మిగతా వాళ్లకు నీటి సరఫరా అందడం జరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయికి నల్లా బిగించకపోవడంతో ఇట్టి నీళ్లు వృధాగా డ్రైనేజీ కాలువలోకి విడవడం జరుగుతుంది.

ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వ అధికారులకు పెడచెవిన పెట్టి కళ్ళ ముందర కనబడుతున్నా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. వర్షపు నీరును ఒడిసిపట్టి ఇంకుడు గుంతల్లోకి వదలాలని, నీటిని వృధా చేయకూడదని ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేసిన ఇట్టి విషయాన్ని పెడచెవిన పెట్టి నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు. ఇటువంటి కుళాయిలకు గ్రామాల్లో ఎన్ని ఉన్నాయో వాటికి నల్లాలని బిగించాలని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. రాబోయేది వేసవి కాలం కాబట్టి ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్క కుళాయికి నల్ల బిగించడం వల్ల గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి నీటి సరఫరా అందుతుందని గ్రామ ప్రజలు తెలియజేశారు.

Next Story