నాణ్య‌త‌తో బీటీ రోడ్డు ప‌నులు చేప‌ట్టాలి

by Nallavelli.Anjaneyulu |

దిశ, చారకొండ :ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ప్రజా ప్రయోజనాల పనులను ధనార్జనే ద్యేయంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ప్రజ

నాణ్య‌త‌తో బీటీ రోడ్డు ప‌నులు చేప‌ట్టాలి
X

దిశ, చారకొండ :ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో కాంట్రాక్టర్లు ఇష్టారీతిన ప్రజా ప్రయోజనాల పనులను ధనార్జనే ద్యేయంగా నిర్మాణ పనులు చేపడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మండల పరిధిలోని సారంబండ తండా నుంచి దొంతులగుట్ట తండా వరకు చేపట్టిన బీటీ రోడ్డు పనులు పూర్తిగా నాసిరకంగా చేపడుతున్నారని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారంబండ తండా నుంచి దొంతులగుట్ట తండా ఒక కిలోమీటర్ రూ. 80 లక్షల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభించారు. రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పూర్తిగా నాసిరకంగా చేపట్టడంతో పేపర్ అట్టా వలే చుట్టుకపోతుంది. తిరిగి రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు చెప్పిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి బీటి రోడ్డు పనులు నాణ్యతగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తండావాసులు పేర్కొంటున్నారు.

Next Story