- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోండి : కలెక్టర్ విజయేందిర బోయి
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలోని రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో ఎ

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : జిల్లాలోని రహదారులపై ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో ఎస్పీ జానకితో కలిసి పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి శాఖల అధికారులతో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. రాష్ట్ర, జాతీయ రహదారులైన 167 అండ్ 44 లపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల వేగాన్ని నియంత్రించే 'రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకులు' వేగానికి సంబంధించిన సైన్ బోర్డ్ లు, బ్రిడ్జి గోడకు స్టిక్కర్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నేషనల్ హైవే లపై మీడియన్ ప్లాంటేషన్ కు రకరకాల పూల మొక్కలను పెట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడా రోడ్ల వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం జరగకుండా గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, అడిషనల్ ఎస్పీ రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, నగరపాలక కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ట్రాన్సపోర్ట్, ఆర్టీసి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం కేటాయింపుకు బ్యాంకు గ్యారెంటీ తప్పనిసరి...
జిల్లాలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు, మిల్లింగ్ కెపాసిటీ లో 10 శాతం బ్యాంకు గ్యారెంటీ తో పాటు అగ్రిమెంట్ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు.కలెక్టర్ కార్యాలయంలో విసీ కాన్ఫరెన్స్ హాల్లో రైస్ మిల్లర్ల తో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. బ్యాంకు గ్యారెంటీ ఇవ్వని మిల్లులకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కేటాయింపులు జరగవని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు రెవెన్యూ కలెక్టర్ మధుసూదన్ నాయక్,డిఎస్ఓ శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్, డిఫ్యూటీ తహసిల్దార్లు, జిల్లా రైస్ మిల్లర్లు అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్, మిల్లర్లు పాల్గొన్నారు.






